Breaking News
Home / National / ‘విక్రమ్’ కోసం మరోసారి ప్రయత్నించిన నాసా….

‘విక్రమ్’ కోసం మరోసారి ప్రయత్నించిన నాసా….

వాషింగ్టన్‌: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంలోని ల్యాండర్‌ ‘విక్రమ్‌’ పరిస్థితిపై ఇంకా స్పష్టత రావట్లేదు. చంద్రుడి ఉపరితలంపై నిస్తేజంగా ఉన్న ల్యాండర్‌ విక్రమ్‌ ఫొటోలు తీసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇటీవల మరోసారి ప్రయత్నించింది. ‘విక్రమ్‌ సాఫ్ట్‌ల్యాండింగ్‌ కోసం నిర్దేశించిన ప్రాంతాన్ని అక్టోబరు 14న లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ ఫొటోలు తీసింది. ఆ ఫొటోలను క్షుణ్ణంగా పరిశీలించామని, అయితే, అందులో ల్యాండర్‌కు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని నాసా వెల్లడించింది. అక్షాంశం తక్కువగా ఉండటం వల్ల లక్షిత ప్రాంతంలో ఎప్పుడూ నీడ ఉంటుందని, ఒకవేళ ల్యాండర్‌ ఆ నీడలో ఉండొచ్చని, లేదా నిర్దేశించిన ప్రాంతానికి అవతల ఉండొచ్చని’ ఎల్‌ఆర్‌వో డిప్యూటీ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ జాన్‌ కెల్లర్ తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *