Breaking News
Home / National / జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి….

జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి….

న్యూఢిల్లీ : దేశంలో రైతుల ప్రయోజనాలు, సంక్షేమం కోసం జాతీయ రైతు కమిషన్‌ ఏర్పాటు చేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఇందుకోసం రాజ్యంగాన్ని సవరించాలని ప్రతిపాదిస్తూ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. రైతు ప్రతినిధులతో ఏర్పాటు చేసే కమిషన్‌ రైతాంగం సంక్షేమం, సంరక్షణ కోసం చేసే సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేసేలా పర్యవేక్షించే అధికారం కూడా ఆ కమిషన్‌కే ఉంటుందన్నారు. దీంతో పాటు ప్రాక్టీసు చేసే న్యాయవాదుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తగిన పథకాలకు రూపకల్పన చేస్తుంది. దానితో పాటు న్యాయవాదుల సామాజిక భద్రత ఫండ్‌ను నెలకొల్పేందుకు వీలు కల్పించేలా 1961 నాటి అడ్వకేట్స్‌ చట్టాన్ని సవరించాలని కోరుతూ రెండో బిల్లును ప్రవేశపెట్టారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *