Breaking News
Home / National / పాకిస్థాన్ పై అజిత్ దోవల్ వ్యాఖ్యలు….

పాకిస్థాన్ పై అజిత్ దోవల్ వ్యాఖ్యలు….

న్యూఢిల్లీ : నేడు ఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ పాకిస్థాన్ దేశం ఉగ్ర కార్యకలాపాలను ఎలా ప్రోత్సహిస్తోందో, ఉగ్ర సంస్థలకు నిధులు ఎలా సమకూరుతున్నాయో ఇలాంటి అంశాలపై ఎటువంటి ఆధారాలు ఉన్నా వాటిని పంచుకోవాలని తెలిపారు. యాంటీ టెర్రర్ స్క్వాడ్‌(ఏటీఎస్‌), స్పెషల్ టాస్క్ ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) దళాలు తమ దగ్గర పాక్‌పై ఎటువంటి ఆధారాలు ఉన్నా వాటిని పంచుకోవాలన్నారు. ఆధారాలను, సాక్ష్యాలను సేకరించాలని, సాక్ష్యాలను ధ్వంసం చేయరాదని తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమనేది పాక్ తన విధానంగా మార్చుకుందన్నారు. పారిస్‌లో జరగనున్న ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో ఉగ్రవాద అంశం చర్చకురానున్నది. టెర్రర్ ఫండింగ్ అంశంలో పాక్‌పై ఒత్తిడి తేవాలని, అందుకే ఆ దేశానికి వ్యతిరేకంగా ఆధారాలను సేకరించాలన్నారు. ఎన్ఐఏ వల్ల ఇండియాలో ఉగ్రకార్యకలాపాలు తగ్గయాన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *