Breaking News
Home / Film News / అజిత్ 60వ చిత్రంలో నటించనున్న నజ్రియా..?

అజిత్ 60వ చిత్రంలో నటించనున్న నజ్రియా..?

చెన్నై: ‘రాజా రాణి’ చిత్రం ద్వారా యువతను ఆకట్టుకున్న నటి నజ్రియా. ‘నేరం’, ‘నయ్యాండి’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత మలయాళ నటుడు పహద్‌ ఫాజిల్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. చాలా గ్యాప్‌ తర్వాత గత ఏడాది ‘కూడే’ అనే మలయాళ చిత్రంలో పృథ్వీరాజ్‌కు చెల్లెలిగా నటించారు. ఈ నేపథ్యంలో అజిత్‌ నటిస్తున్న 60వ చిత్రం ‘వలిమై’లో నజ్రియా ఓ పాత్ర పోషించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘నేర్‌కొండ పార్వై’ చిత్రాన్ని తెరకెక్కించిన హెచ్‌.వినోద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. నయనతార కథానాయికగా నటిస్తోంది. అజిత్‌కు జోడీగా నయన్‌ నటించడం ఇది ఐదోసారి. ఇందులో నజ్రియా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఆమె కథ విన్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ‘నేర్‌కొండ పార్వై’ చిత్రంలో కూడా ఆమె నటింపజేసేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ‘వలిమై’లో కచ్చితంగా నటిస్తున్నారని తెలుస్తోంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *