Breaking News
Home / National / భారీ వర్షంలోనూ ప్రచారం చేసిన ఎన్సీపీ అధినేత…

భారీ వర్షంలోనూ ప్రచారం చేసిన ఎన్సీపీ అధినేత…

ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు తారస్థాయికి చేరింది. ప్రచార పర్వానికి నేటితో తెరపడనుండటంతో రాష్ట్రంలోని వివిధ పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా పవార్‌ సతారా ప్రాంతంలో పబ్లిక్‌ ర్యాలీ నిర్వహిస్తుండగా భారీ వర్షం కురిసింది. ఓ వైపు ఉరుములు, మెరుపులతో వాతావరణం బీభత్సంగా ఉన్నా.. పవార్‌ ఏ మాత్రం బెదరకుండా ప్రచారం కొనసాగించారు. భారీగా వర్షం కురుస్తున్నప్పటికీ అక్కడికి వచ్చిన ప్రజలు కూడా అంతే శ్రద్ధగా ఆయన ప్రసంగాన్ని విన్నారు. మాటల మధ్యలో ఓటర్లకు క్షమాపణలు చెబుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. వర్షం శుభసూచకమని చెబుతూ..సతారాలో ఎన్సీపీ చరిత్ర సృష్టిస్తుందన్నారు. పవార్‌ సంకల్పం ముందు, వరుణుడు కూడా తలదించాల్సి వచ్చిందని అక్కడున్నవారు ప్రశంసించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *