Breaking News
Home / States / Andhra Pradesh / కాలుష్యంపై అప్రమత్తత అవసరం….

కాలుష్యంపై అప్రమత్తత అవసరం….

విశాఖ: వాతావరణ కాలుష్యం మానవాళి మొత్తాన్ని అంతం చేయగలదని గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ హెచ్చరించారు. పెరుగుతున్న  కాలుష్యంపై ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఐఐపీఈ 4వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యావరణహిత వనరుల వినియోగం దిశగా మౌలిక వసతులు, పరిజ్ఞానం అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించే దిశగా ప్రజలు బాధ్యత తీసుకోవాలని గవర్నర్‌ సూచించారు. ప్రపంచ స్థాయి సంస్థలతో ఐఐపీఈ ఎంఓయూలు కుదుర్చుకోవడం అభినందనీయమని కొనియాడారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *