Breaking News
Home / States / Andhra Pradesh / ఇంద్రకీలాద్రిపై పులిహోర తయారీ కేంద్రంలో నిర్లక్ష్యం

ఇంద్రకీలాద్రిపై పులిహోర తయారీ కేంద్రంలో నిర్లక్ష్యం

విజయవాడ: దేవాలయానికి వెళ్తే ఇచ్చే ప్రసాదాన్ని ఎంతో భక్తితో కళ్లకద్దుకుని తింటాం. దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం ఎంతో పవిత్రంగా భావిస్తాం. అదిపులిహోరకానీ, లడ్డూకానీ ఏదైనా దేవుడిపై భక్తితోనే వాటిని ఆరగిస్తాం. కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం తయారీలో నిర్లక్ష్యం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సాక్షాత్తూ దుర్గమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం తయారీ కేంద్ర అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఇంద్రకీలాద్రిలో పరిస్థితి ఎలా వుందో శనివారం స్పష్టమైంది. ఇక్కడి పులిహోర తయారీ కేంద్రంలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.

చేతులకు గ్లౌజులు, ముఖాలకు మాస్క్‌లులేకుండా అపరిశుభ్ర వాతావరణంలో పులిహోర తయారుచేస్తున్నారు. తీవ్ర ఉక్కపోత కారణంగా సిబ్బందికి చెమటలు పడుతున్నా చెమటలు చిందిస్తూ పులిహోర తయారుచేస్తున్నారు. పలు సందర్భాల్లో పులిహోర కాళ్లకింద పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు సైతం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఇదంతా మామూలేనని కాంట్రాక్టర్లు అంటున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇక్కడి ప్రసాదాన్నే విక్రయిస్తున్నారు. విషయం తెలిసిన భక్తులు మండిపడుతున్నారు. పులిహోర తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించక పోయినా అధికారులు మాత్రం చోద్యంచూస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి అపరిశుభ్రమైన వాతావరణంలోనే ప్రసాదాల తయారీ కొనసాగుతోంది. ఉత్సవాల తొలిరోజూ అధికారుల నిర్లక్ష్యం బయటపడడంతో ఇక్కడికి వచ్చిన భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *