Breaking News
Home / States / విద్యుత్ కార్మిక సంఘాలతో చర్చలు సఫలం….

విద్యుత్ కార్మిక సంఘాలతో చర్చలు సఫలం….

హైదరాబాద్‌: విద్యుత్‌ కార్మిక సంఘాల డిమాండ్లపై యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. ఏపీఎస్‌ఈబీ సర్వీసు నిబంధనల అమలు, విద్యుత్‌ సంస్థల్లో నియామకమైన కార్మికులందరికీ పాత పెన్షన్‌ విధానం అమలుతో పాటు ఇతర డిమాండ్ల సాధనపై కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ కార్మిక సంఘం నేతలతో నగరంలోని విద్యుత్‌సౌధలో విద్యుత్‌ యాజమాన్యం నేడు చర్చలు చేపట్టింది. ఈ చర్చల్లో విద్యుత్‌ సంస్థల సీఎండీలు ప్రభాకర్‌రావు, రఘురామ్‌రెడ్డి, గోపాల్‌రావు పాల్గొన్నారు. విద్యుత్‌ కార్మిక సంఘాల డిమాండ్లపై విద్యుత్‌ యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *