Breaking News
Home / States / Andhra Pradesh / గుంటూరులో నన్నపనేని రాజకుమారి దీక్ష

గుంటూరులో నన్నపనేని రాజకుమారి దీక్ష

గుంటూరు: ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు మద్దుతగా జిల్లాలోని మార్కెట్ సెంటర్‌లో మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నన్నపనేని మాట్లాడుతూ మహిళా కమిషన్ తరుపున ముఖ్యమంత్రికి మద్దతుగా దీక్ష చేస్తున్నామని అన్నారు. ప్రధాని మోదీ తన స్థాయి దిగజారి మాట్లాడారని విమర్శించారు. ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదన్నారు. చంద్రబాబుని తిట్టడానికే మోదీ ఏపీకి వచ్చారని నన్నపనేని రాజకుమార్ మండిపడ్డారు.

Check Also

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…

Share this on WhatsAppతిరుమల: తిరుమల శ్రీవానివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *