Breaking News
Home / World News / భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేసిన నేపాల్!

భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేసిన నేపాల్!

తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని భారతీయ మీడియా చానల్స్‌పై రాజకీయ, చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. నేపాల్‌లో చైనా రాయబారి హావో యాంగ్ చీ అక్కడి కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కావడంపై కొన్ని భారతీయ మీడియా సంస్థలు అవహేళనకరమైన రీతిలో తప్పుడు వార్తలు ప్రచారం చేశాయని నేపాల్ ఆరోపించింది. గురువారం సాయంత్రం నుంచి నేపాల్ కేబుల్ ఆపరేటర్లు భారత టెలివిజన్ చానళ్ల ప్రసారాన్ని నిలిపేశారు. “కొన్ని భారత చానళ్లలో నేపాల్ ప్రధానమంత్రి గురించి అభ్యంతరకరమైన వార్తలు ప్రసారమవుతున్నాయి” అని వారన్నారు. మాక్స్ టివి ఆపరేటర్ కె. ధ్రువ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, “కొన్ని భారతీయ చానళ్లు నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి గురించి, చైనా రాయబారి గురించి అభ్యంతరకర విషయాలను ప్రసారం చేస్తున్నాయి” అని అన్నారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *