Breaking News
Home / States / Andhra Pradesh / విశాఖలో అనుమానాస్పద స్థితిలో నేపాల్ మైనర్ బాలిక మృతి…..

విశాఖలో అనుమానాస్పద స్థితిలో నేపాల్ మైనర్ బాలిక మృతి…..

విశాఖలో నేపాల్ కు చెందిన ఓ మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే బాలిక మృతదేహాన్ని దహనం చేసేందుకు తల్లిదండ్రులు శ్మశానానికి తీసుకువెళ్లారు. మృతురాలి శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి ప్రకటించడంతో తల్లిదండ్రులు ఖంగారుపడ్డారు. కాటికాపరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మధురవాడ చైతన్య కాలేజీలో నేపాల్ కు చెందిన బహుదూర్ సెక్యూరిటీ గార్డుగా ఉన్నాడు. అక్కడే కుటుంబంతో ఉంటున్నాడు తన కుమార్తె మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లి కమల తెలిపింది. దీంతో కుమార్తె మృతదేహాన్ని దహనం చేసేందు కు కాన్వెంట్ జంక్షన్ స్మశాన వాటికకు తీసుకువెళ్ళారు. సాయంత్రం వేళ తీసుకువెళ్ళి దహనం చేద్దామని భావించిన తల్లిదండ్రులకు కాటికాపరి అడ్డుకున్నారు.

మృతురాలి మెడపై ఉరివేసు కున్న గుర్తు లు తలపై గాయాలు ఉండడం తో శ్మశానవాటిక సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.అసలు ఎందుకు ఈ అభం శుభం తెలియని చిన్నారి ఇంత పెద్ద అఘయిత్యానికి పాల్పడి ఉంటుందని అనుమాలు వెల్లడవుతున్నాయి.

తన తల పై ఉన్న దెబ్బలు కూడా పలు అనుమానాలకు తెర లేపుతన్నాయి. కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *