Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఎప్పటికీ అధికారం మీదే అనుకోవద్దు…

ఎప్పటికీ అధికారం మీదే అనుకోవద్దు…

అమరావతి: యర్రబాలెం గ్రామానికి చెందిన పద్మ అరెస్ట్‌ను టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఆమె అరెస్ట్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించిన లోకేష్.. చంద్రబాబు బస్సుపై చెప్పులు, రాళ్లతో జగన్ దాడి చేయిస్తే పోలీసులకు అది భావ ప్రకటన స్వేచ్ఛగా కనిపించిందని, జగన్ చెత్త పాలన చూసి కడుపు మండి ఒక మహిళ మాట్లాడితే పోలీసులకు అది చట్టవ్యతిరేక చర్యగా కనిపించిందా? అని ఫైర్ అయ్యారు. మంత్రులు బూతులు తిట్టినా, దుర్భాషలాడినా అది పవిత్రమైన భావ ప్రకటనా స్వేచ్ఛలా కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. ఎప్పటికీ మీదే అధికారం అని అనుకోవడం అవివేకం అంటూ వైసీపీ నేతలకు లోకేష్ హితవు పలికారు. వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తే తర్వాత మీ మెడకే చుట్టుకుంటుందని వైసీపీ నేతలను ఆయన హెచ్చరించారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *