Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏ రాష్ట్రంలోనూ ఇంత తక్కువకు అమ్మలేదు…

ఏ రాష్ట్రంలోనూ ఇంత తక్కువకు అమ్మలేదు…

అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత తక్కువకు ఉల్లిపాయలు అమ్మడం లేదని, ఒక్క ఏపీలోనే కిలో ఉల్లి రూ.25కు అమ్ముతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో ఉల్లి ధరల అంశంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ… మన రాష్ట్రంలో ఉల్లి లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా తాము కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. దేశం మొత్తంమీద ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే రూ.25 లకు అమ్ముతోందన్నారు.

ఇంతవరకు 36,500 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజార్లలో కేజీ రూ.25లకు అమ్ముతున్నామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకడంలేదని షోలాపూర్, ఆల్వార్‌ లాంటి ప్రాంతాలనుంచి కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇదే చంద్రబాబు హయాంలో ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు రాక, పొలాల్లోనే వదిలేసిన పరిస్థితులు చూశామన్నారు. ఇవాళ రైతులకు మంచిరేటు లభిస్తోందని, మరోవైపు వినియోగదారులకు నష్టం రాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుని కేజీ రూ.25లకు అమ్ముతున్నట్లు జగన్ వ్యాఖ్యానించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *