Breaking News
Home / National / బెంజ్‌ విడుదల చేసిన సరికొత్త కారు….

బెంజ్‌ విడుదల చేసిన సరికొత్త కారు….

ముంబయి: భారత మార్కెట్లోకి సరికొత్త కారును బెంజ్‌ విడుదల చేసింది. బెంజ్‌ జీ 350డీ పేరుతో ఎస్‌యూవీ ప్రియులకు పరిచయం చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.5కోట్లుగా నిర్ణయించింది. భారత్‌లోకి తొలిసారి ఏఎంజీ కాని జీక్లాస్‌ను తీసుకురావడం విశేషం. జీ వేగన్‌గా పిలిచే ఈ మోడల్‌ను తొలుత సైనికుల కోసం నిర్మించారు. ఆ తర్వాత సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చారు. దాదాపు 40 ఏళ్ల నుంచి జీక్లాస్‌ శ్రేణికార్లను బెంజ్‌ ఉత్పత్తి చేస్తోంది. రేంజి రోవర్‌ స్పోర్ట్‌, పోర్ష్‌ కెనాన్‌, ల్యాండ్‌రోవర్‌ డిఫెండర్లకు గట్టి పోటీ ఇస్తుంది.

కొత్త కారును జీ63 ఏఎంజీతో పోలిస్తే ఇంజిన్‌లో భారీ మార్పు చేశారు. జీ 350డీ ఇంజిన్‌ కొంత అందుబాటు ధరలో తయారు కావడం విశేషం. 3.0లీటర్‌ సిక్స్‌సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను కారుకు అమర్చారు. ఈ కారు 282 బీహెచ్‌పీ శక్తి, 600 ఎన్‌ఎం టార్క్‌ విడుదల చేస్తుంది. ఆల్‌వీల్‌ డ్రైవింగ్‌తో వచ్చే ఈకారు ఆఫ్‌రోడ్‌ ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. గాజుతో తీర్చిదిద్దిన ఆకర్షణీయమైన క్యాబిన్‌ను బెంజ్‌ ఇచ్చింది. దీనిలో ఐదుగురు కూర్చుని సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *