న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న వాట్సాప్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకూ అందుబాటులోకి వచ్చేసింది. వాట్సాప్‌కు ఫింగర్‌ప్రింట్ లాక్‌ను తీసుకొచ్చినట్టు గురువారం వాట్సాప్ వెల్లడించింది. ఐఫోన్ యూజర్లకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఫింగర్‌ప్రింట్, ఫేస్ఐడీ రెండూ అందుబాటులో ఉన్నాయి. తాజా ఫీచర్ అందుబాటులోకి రావడంతో ఇకపై ఆండ్రాయిడ్ యూజర్లు తమ వాట్సాప్‌ను ఓపెన్ చేసేందుకు ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్ ఉపయోగించుకోవచ్చు.
ఐఫోన్ యూజర్లు ఉపయోగిస్తున్నట్టుగానే ఆండ్రాయిడ్ యూజర్లు కూడా ఇప్పుడు లాక్‌ను ఎంచుకోవచ్చు. ఒకసారి ఫింగర్ అథెంటికేషన్ ఇస్తే.. ఆపై దానిని తెరవాలంటే టచ్ఐడీ ఇవ్వడం తప్పనిసరి. అలాగే, వాట్సాప్‌కి ఎంతసేపటిలో లాక్ పడాలో కూడా ముందే ఆటోమెటిక్ లాక్‌ను సెట్ చేసుకోవచ్చు. మెసేజ్ నోటిఫికేషన్లు కనిపంచేలానూ చేసుకోవచ్చు.
వాట్సాప్ ఫింగర్‌ప్రింట్ లాక్ కోసం యూజర్లు తొలుత సెట్టింగ్స్‌లో అకౌంట్-ప్రైవసీలోకి వెళ్తే ఫింగర్‌ప్రింట్ లాక్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. అన్‌లాక్ విత్ ఫింగర్‌ప్రింట్ అన్న ఆప్షన్‌ను ఆన్ చేసిన తర్వాత ఫింగర్‌ప్రింట్‌ను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని రోజుల్లోనే ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.