Breaking News
Home / social media / ఫేస్‌బుక్‌లో సరికొత్త ఫీచర్..

ఫేస్‌బుక్‌లో సరికొత్త ఫీచర్..

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ.. తమ మార్కెట్‌ను పెంచుకుంటూపోతోంది. ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ఈ టూల్ ద్వారా యూజర్లు తమ ఫేస్‌బుక్‌ ఖాతాలోని ఫోటోలను ఈజీగా గూగుల్ అకౌంట్లలోకి మార్చుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పైలెట్ స్టేజిలో ఉండగా.. ఐర్లాండ్‌లోని కొంతమంది యూజర్లకు ఈ టూల్ ఇప్పటికే అందిస్తోంది. ఇది సక్సెస్ అయితే.. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌బీ ఉపయోగిస్తున్న అందరికి అందుబాటులోకి తీసుకురానుంది. కాగా, ఈ టూల్‌ను డేటా ట్రాన్స్‌ఫర్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది.

Check Also

భారత ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని ..?: టిక్‌టాక్

Share this on WhatsAppతమ యాప్‌ను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్‌టాక్ మరోసారి స్పందించింది. భారత ప్రభుత్వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *