Breaking News
Home / Lifestyle / Business / భారత మార్కెట్‌లో విడుదలైన సరికొత్త కారు…..

భారత మార్కెట్‌లో విడుదలైన సరికొత్త కారు…..

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం హ్యూండాయ్‌ 2019 ‘ఐ20 యాక్టివ్‌’ కారును భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో దీని ప్రారంభ ధర రూ.7.74 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ కారును ఎస్‌, ఎస్‌ఎక్స్‌, ఎస్‌ఎక్స్‌ డ్యూయల్‌ టోన్‌ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రయాణికుల భద్రత కోసం ఈ కొత్త మోడల్‌లో పార్కింగ్‌ సెన్సర్‌, స్పీడ్‌ అలర్ట్‌ సిస్టం, రివర్స్‌ కెమెరా, డ్రైవర్‌-ప్యాసింజర్‌ సీట్‌ బెల్ట్‌ రిమైండర్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లను జోడించారు.

ఈ కారు పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో లభిస్తోంది. 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ 82 బీహెచ్‌పీ శక్తిని 115 ఎన్‌ఎం టార్క్‌ను, 1.4లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ 89 బీహెచ్‌పీ శక్తిని 220 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి 6-స్పీడ్‌ గేర్‌ బాక్సును అమర్చారు. ఎస్‌ఎక్స్‌ వేరియంట్‌లో మాత్రమే డీజిల్‌ ఇంజిన్‌ అందుబాటులో ఉంటుందని హ్యూండాయ్‌ తెలిపింది. కారు వెలుపలి భాగంలో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ హెడ్‌ల్యాంప్స్‌, కార్నరింగ్ ల్యాంప్స్‌, ఫాగ్‌ ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్‌, షార్క్‌ ఫిన్‌ యాంటీనా, డైమండ్‌ కట్‌ అలాయ్‌ వీల్స్‌ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను అమర్చారు.

ఇంకా కారులో 7 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ ఉంది. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోను సపోర్ట్‌ చేస్తుంది. వీటితో పాటుగా పుష్‌బటన్‌ స్టార్ట్‌, కీలెస్‌ ఎంట్రీ, ఆటో క్లైమెట్‌ కంట్రోల్ ఏసీ, వైర్‌లెస్‌ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

Check Also

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

Share this on WhatsAppసరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *