Breaking News
Home / States / తెలంగాణలో కొత్త మద్యం విధానం

తెలంగాణలో కొత్త మద్యం విధానం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. నవంబర్‌ 1, 2019 నుంచి అక్టోబర్‌ 30 వరకు ఈ విధానం అమల్లో ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 50 లక్షల లైసెన్స్‌ ఫీజు వసూలు చేయనున్నారు. 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ప్రాంతాల్లో రూ.60 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు లైసెన్స్‌ ఫీజును ఖరారు చేశారు. మద్యం దుకాణాల కోసం నాన్‌ రిఫండబుల్‌ దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలుగా నిర్ణయించారు. రాష్ట్రంలో 2,216 దుకాణాలకు లాటరీ పద్ధతి ద్వారా దుకాణ దారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. అంతేకాకుండా మద్యం షాపులు తెరచి ఉంచే సమయాలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *