Breaking News
Home / Film News / ఆమె పుట్టినరోజు సందర్భంగా న్యూ లుక్ రిలీజ్….

ఆమె పుట్టినరోజు సందర్భంగా న్యూ లుక్ రిలీజ్….

ఫిల్మ్ న్యూస్: క్రీడా నేపథ్యంలో కీర్తీ సురేశ్‌ ప్రధాన తారగా దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో వర్క్‌ ఎమోషన్‌ ఆర్ట్స్‌ నిర్మాణంలో సుధీర్‌ చంద్ర ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీలో ‘హైదరాబాద్‌ బ్లూస్‌’, ‘రాక్‌ఫోర్డ్‌’, ‘ఇక్బాల్‌’ చిత్రాలతో పేరు తెచ్చుకున్న నగేశ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు తెలుగులో తొలి చిత్రమిది. క్రీడా నేపథ్యంలో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన తారాగణం. గురువారం కీర్తీ సురేశ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె లుక్‌ విడుదల చేశారు. ఆమె ఏ ఆట ఆడుతుంది? ఏ ఆటలో విజయం సాధిస్తుంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌! ”త్వరలో ఫస్ట్‌ లుక్‌, సినిమా టైటిల్‌ విడుదల చేస్తాం. నవంబర్ 11 నుంచి హైదరాబాద్‌లో లాస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం” అని సుధీర్‌ చంద్ర తెలిపారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *