Breaking News
Home / National / వజ్రంతో పోల్చేంత దృఢత్వం కలిగిన సరికొత్త పదార్ధం…..

వజ్రంతో పోల్చేంత దృఢత్వం కలిగిన సరికొత్త పదార్ధం…..

మాద్రీద్‌: ప్రపంచంలోనే అత్యంత దృఢమైన సరికొత్త పదార్థాన్ని స్పెయిన్‌ శాస్త్రవేత్తలు సృష్టించారు. అత్యంత చవగ్గానే దీన్ని తయారు చేయగలగడం మరో విశేషం. ప్రకృతిలో బోరాన్‌, కార్బైడ్‌లు ఉచితంగా లభించేవే. వీటికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఈ రెండింటినీ మేళవిస్తే గట్టి పదార్థాన్ని సృష్టించవచ్చని ఏళ్ల తరబడి తెలిసినా అది కలగానే మిగిలిపోతూ వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్‌ సెవిలె శాస్త్రవేత్తలు లేజర్‌ రేడియేషన్‌ ద్వారా ఈ బోరాన్‌ కార్బైడ్‌ను సమ్మిళితం చేసి, గట్టి పరచడంలో విజయం సాధించారు. ఎంత గట్టిదో చెప్పాలంటే దాన్ని వజ్రంతో పోల్చాల్సిందే. వజ్రం దృఢత్వం 45 గిగాపాస్కల్స్‌ (జీపీఏ), బిగుతు 1050 జీపీఏ ఉంటుంది. ఈ సరికొత్త పదార్థం గట్టిదనం 52 జీపీఏ, బిగుతు 600 జీపీఏ ఉన్నట్టు పరిశోధకులు లెక్కగట్టారు. ఆల్ట్రా నిరోధక సామర్థ్యం, రేడియో యాక్టివిటీ ఉండటం దీని ప్రత్యేకతలు. భవిష్యత్తులో కార్లు, విమానాలు తదితర రవాణా వాహనాల తయారీలో ఇది సరికొత్త అధ్యాయం సృష్టించనుందని భావిస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *