Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీలో అవినీతికి తావులేని కొత్త విధానం..

ఏపీలో అవినీతికి తావులేని కొత్త విధానం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌‌లో అవినీతికి తావులేని కొత్త సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ విధానం నవంబర్‌ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. క్రయ, విక్రయదారులే సొంతగా తమ డాక్యుమెంట్ తయారు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. మధ్యవర్తుల ప్రమేయానికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 16 రకాల నమూనాలను ప్రభుత్వం రూపొందించింది. నగదు రహిత కార్యకలాపాలకు పెద్దపీట వేసింది. పారదర్శకతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఈనెల 14 నుంచి అన్ని జిల్లాల్లో నూతన విధానంపై వర్క్‌షాప్‌‌లు నిర్వహించనుంది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనుంది. కొత్త విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కృష్ణా, విశాఖపట్నంలో ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలవుతోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *