Breaking News
Home / States / Andhra Pradesh / విశాఖలో కరోనా కేసుల్లో కొత్త రికార్డు.. ఒక్క రోజులోనే..

విశాఖలో కరోనా కేసుల్లో కొత్త రికార్డు.. ఒక్క రోజులోనే..

ఒక్క రోజులోనే 144 కరోనా కేసులు
జిల్లాలో 1,807కు చేరిన పాజిటివ్‌లు
జీవీఎంసీ 98వ వార్డులో 15 మందికి వైరస్‌
ఆలయాల్లో 12 మంది ఉద్యోగులకు….
గోపాలపట్నంలో 8, అల్లిపురంలో 4, వెంకోజీపాలెంలో 3 కేసులు
చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృతి
15కు చేరిన కొవిడ్‌ మరణాలు
విశాఖపట్నం: జిల్లాలో కరోనా వైరస్‌ మహమ్మారి కరాళనృత్యం చేస్తున్నది. రోజూ రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గురువారం 144 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 1807కు చేరింది. జీవీఎంసీ 98వ వార్డులో 15 మంది, గోపాలపట్నం ప్రాంతంలో ఎనిమిది మంది, వైరస్‌ బారిన పడ్డారు. దేవదాయశాఖ పరిధిలోని వివిధ ఆలయాల్లో పని చేస్తున్న 12 మంది సిబ్బందికి పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. జిల్లాలో వైరస్‌ బారినపడిన వారిలో 879 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, 913 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా వైరస్‌ బాధితుల్లో మరో ఇద్దరు మృతి చెందగా, కొవిడ్‌ మరణాల సంఖ్య 15కు చేరింది.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *