Breaking News
Home / Featured / భారత్‌ మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల….

భారత్‌ మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల….

ముంబయి: జడ్‌టీఈకి చెందిన సబ్‌బ్రాండ్ నూబియా తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్ మ్యాజిక్ 3ఎస్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.65 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ హెచ్‌డీఆర్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 12 జీబీ వరకు ర్యామ్ తదితర అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ ఎక్కువగా హీట్ అవకుండా ఉండేందుకు గాను ఇందులో ప్రత్యేకంగా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ కెమెరాతోపాటు మరో 12 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ రెండు కెమెరాలతో ఏకంగా 8కె రిజల్యూషన్ కలిగిన వీడియోలను షూట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీకి 27వాట్ల క్విక్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు.

నూబియా రెడ్ మ్యాజిక్ 3ఎస్ ఫీచర్లు…

6.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 48, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. నూబియా రెడ్ మ్యాజిక్ 3ఎస్ స్మార్ట్‌ఫోన్ మెకా సిల్వర్, సైబర్ షేడ్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.35,999 ఉండగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.47,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఈ నెల 21వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు.

Check Also

వరుడు ఒక్కడే.. కానీ వధువులిద్దరు

Share this on WhatsAppమధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్ కు చెందిన సందీప్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రేమించిన పిల్ల, పెద్దలు చూసిన పిల్ల.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *