Breaking News
Home / National / మెట్రో రైళ్లలో రానున్న నూతన వ్యవస్థ…

మెట్రో రైళ్లలో రానున్న నూతన వ్యవస్థ…

ఢిల్లీ: ఇకపై ఢిల్లీ మెట్రోలోని ఏ రూట్‌లోనైనా సాంకేతిక అవాంతరాలు ఏర్పడినప్పుడు మెట్రో ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేని నూతన వ్యవస్థ అందుబాటులోకి రానుంది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పడు ఆ రూట్ మొత్తంపై ప్రభావం పడకుండా ఉండేలా ఆ మెట్రో రైలులోని ప్రయాణికులను సమీపంలోని ఇంటర్ ఛేంజ్ స్టేషన్ లేదా స్టేషన్ వరకూ తరలించనున్నారు. ఇదంతా వర్చువల్ సిగ్నలింగ్ సిస్టమ్ ద్వారా సాధ్యం కానుంది. దీనిపై డీఎంఆర్సీ డైరెక్టర్ మంగూ సింగ్ మాట్లాడుతూ ఈ నూతన విధానం దిశగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ వర్చువల్ సిస్టమ్ మెట్రోకు ఉన్న సిగ్నలింగ్ సిస్టమ్‌తో అనుసంధానమై పనిచేయనుంది. ఎక్కడైనా సిగ్నలింగ్ సిస్టమ్‌లో సాంకేతిక లోపాలు తలెత్తితే, లేక మెట్రోలో బ్రేక్‌డౌన్ అయితే వర్చువల్ సిగ్నలింగ్ సాయంతో ట్రైన్‌ను ముందుకు నడిపిస్తారు. తద్వారా మెట్రో ప్రయాణికులు రైల్లో చిక్కకుపోవడం లాంటిది జరగదని తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *