Breaking News
Home / National / సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్భయ నిందితుడు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్భయ నిందితుడు

న్యూఢిల్లీ: 2012 నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నిందితుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ అతడు పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని కోరేందుకు నిందితుడు తన పిటిషన్‌లో ఓ వింత వాదన కూడా వినిపించినట్టు సమాచారం. ‘‘ఢిల్లీలో వాయు కాలుష్యం, విషతుల్య వాతావరణం కారణంగా ఇప్పటికే ఆయుర్దాయం తగ్గిపోతోంది. అలాంటప్పుడు మాకు మరణ శిక్ష విధించడం ఎందుకు…’’ అని నిందితుడు పేర్కొన్నట్టు తెలుస్తోంది. తాజా పిటిషన్‌తో నిర్భయ కేసులో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉరిశిక్ష అమలవుతుందా లేదా అన్నది మరోసారి సందేహాస్పదంగా మారింది. ఇప్పటికే ఈ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు కాగా… సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దీన్ని స్వీకరించింది. కాగా ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వినయ్, పవన్ కుమార్ గుప్తా ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఉపశమనం కోసం పిటిషన్ దాఖలు చేయలేదు.

నిందితుల తరపు న్యాయవాది మాట్లాడుతూ.. అక్షయ్ రివ్యూ పిటిషన్‌పై ఏ సంగతీ తేలిన తర్వాతే మిగతా నిందితులు కలిసికట్టుగా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తారని తెలిపారు. కాగా ఈ కేసులోని మరో నిందితుడు పవన్ గుప్తాను ఇప్పటికే మండోలీ జైల్ నుంచి తీహార్ జైలుకు తరలించారు. గుప్తాతో పాటు మరో ఇద్దరు నిందితులు ముఖేశ్ సింగ్, అక్షయ్ ప్రస్తుతం రెండో నెంబర్ తీహార్ జైల్లో ఉన్నారు. మరో నిందితుడు వినయ్ శర్మను నాలుగో నంబర్ తీహార్ జైల్లో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *