Breaking News
Home / National / మరోసారి వార్తల్లో నిత్యానంద

మరోసారి వార్తల్లో నిత్యానంద

అహ్మదాబాద్: నిత్యానంద నిర్వహణలో ఉన్న స్కూల్లో తమ ఇద్దరు కూతుళ్లను నిర్భంధించారని..వారిని విడిపించాలంటూ గుజరాత్ హైకోర్టులో ఆ బాలికల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. బెంగళూరుకు చెందిన జనార్ధన శర్మ ఆయన భార్య ఈ మేరకు సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 2013లో స్వామీ నిత్యానంద ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ పాఠశాలలో తమ నలుగులు కూతుళ్లను చేర్పించామని తెలిపారు. అయితే ఈ ఏడాది అహ్మదాబాద్‌లోని యోగినీ సర్వజ్ఞపీఠానికి తమ కూతుళ్లను జేర్పించారని తెలియడంతో అక్కడ వారిని కలుసుకునేందుకు ప్రయత్నించామని వారు తెలిపారు. అయితే బిడ్డలను కలుసుకునేందుకు తమకు పీఠం అధికారులు అనుమతివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని..వారి సాయంతో తమ ఇద్దరు మైనర్ కూతుళ్లను విడిపించిచుకున్నామని తెలిపారు. కానీ పెద్ద కూతుళ్లైన లోపాముద్ర శర్మ(21), నందితలు(18) మాత్రం తమ వెంట వచ్చేందుకు నిరాకరించారని కోర్టుకు తెలిపారు. అయితే వారిరువురినీ అక్కడ బలంవతంగా నిర్భంధించారని, తమ బిడ్డలను తమకు అప్పగించేలా పోలీసులకు, విద్యాపీఠం అధికారులకు కోర్టు ఆదేశాలు జారీచేయ్యాలన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంతో పాటు ఆ విద్యాపీఠంలో ఉంటున్న ఇతర మైనర్ల విషయంలో కూడా దర్యాప్తు చేపట్టాలని వారు కోర్టుకు నివేదించారు.

Check Also

తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ…

Share this on WhatsAppఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *