Breaking News
Home / States / ఎలాంటి చర్యలు తీసుకోలేదు….

ఎలాంటి చర్యలు తీసుకోలేదు….

హైదరాబాద్‌: ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ప్రవేశ పెట్టిన పథకాల్లో అక్రమాలు జరిగాయని సీపీఎం నేతలు అనిశా డీజీకి ఫిర్యాదు చేశారు.  ఔషధాల కొనుగోలులో అవకతవకలు చోటుచేసుకున్నాయని సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ అనిశా డీజీకి రాసిన లేఖలో వివరించారు. 2016 నుంచి 2018 మధ్య కాలంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవోగా ఉన్న పద్మ సుమారు రూ. 20 కోట్ల విలువైన ఔషధాలు కొనుగోలు చేశారని లేఖలో పేర్కొన్నారు. అందులో దాదాపు 19 ఫార్మా కంపెనీల నుంచి కొనుగోళ్లు జరిగాయని.. నిబంధనలకు విరుద్ధంగా ఈ కొనుగోళ్లు జరిగినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు బోర్డు తేల్చిందన్నారు. దీనిపై ఆరోగ్యశ్రీ ట్రస్టు బోర్డు వైద్యారోగ్య శాఖకు నివేదిక సమర్పించి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో సీపీఎం నేతలు పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *