Breaking News
Home / National / ముంబైకి తిరిగివ‌చ్చిన ఐదు ల‌క్ష‌ల వ‌ల‌స కూలీలు!

ముంబైకి తిరిగివ‌చ్చిన ఐదు ల‌క్ష‌ల వ‌ల‌స కూలీలు!

ముంబై: కొన్ని రోజుల క్రితం మ‌హాన‌గరం ముంబై నుండి త‌మ స్వ‌స్థ‌లాల‌కు త‌ర‌లిపోయిన వ‌ల‌స‌ కూలీలు తిరిగి ముంబైకి చేరుకుంటున్నారు. మహారాష్ట్రలో పారిశ్రామిక కర్మాగారాలు, వివిధ మెట్రో ప్రాజెక్టులు ప్రారంభం కావ‌డంతో ఉపాధి పొందేందుకు తిరిగి వలస కార్మికులు ముంబైకి వ‌స్తున్నారు. రైల్వేశాఖ నుంచి అందిన వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే ఇంత‌కుముందు క‌రోనా భయంతో వారి గ్రామాల‌కు వెళ్లిపోయిన‌ ఐదున్నర లక్షల మంది వ‌ల‌స కార్మికులు, వ్యాపారులు తిరిగి ముంబైకి చేరుకున్నారు. మహారాష్ట్ర నుంచి 844 రైళ్ళలో జూన్ మాసానికి ముందు మొత్తం 18 లక్షల మంది కార్మికులు వారి స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయన‌వారంతా ముంబైకి తిరిగి వ‌స్తున్నారు. ఈ సంద‌ర్భంగా వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రవీంద్ర భాకర్ మాట్లాడుతూ జూన్ ఒక‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఐదు లక్షలకుపైగా ప్రయాణికులు ముంబైకి వ‌చ్చార‌న్నారు. ప్రత్యేక రైళ్లు నడిపిన‌ప్పుడు 70 శాతం సీట్లు మాత్ర‌మే నిండాయ‌ని‌, ఇప్పుడు చాలా రైళ్లలో 100 శాతం సీట్లు బుక్ అవుతున్నాయ‌న్నారు. ముంబైకి తిరిగివ‌చ్చిన‌వారిలో యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన‌వారు అధికంగా ఉంటున్నార‌న్నారు.

Check Also

మళ్లీ లాక్ డౌన్

Share this on WhatsApp కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ రాజధాని నగరమైన పట్నాలో ఈ నెల 10 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *