Breaking News
Home / National / ఆ ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఆలోచన లేదు…

ఆ ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఆలోచన లేదు…

ఇరాన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోమని ఇరాన్‌ ఉద్ఘాటించింది. వచ్చే ఏడాది జరుగనున్న అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఇరాన్‌ ప్రయత్నిస్తోందని వచ్చిన వార్తలను ఆ దేశ విదేశాంగ మంత్రి జవాద్‌ జరీఫ్‌ ఖండించారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కానీ, ఆ ఆలోచన కానీ తమకు లేదన్నారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ అమెరికా తమపై సైబర్‌ పోరు ప్రారంభించిందంటూ ఎటువంటి యుద్ధాన్నయినా అమెరికా ప్రారంభించగలదు తప్ప దానిని ఆపే సామర్ధ్యం లేదని అన్నారు. తమ దేశ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశాల జాబితాలో ఇరాన్‌ను కూడా అమెరికా ఇంటెలిజెన్స్‌ చేర్చిందన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *