Breaking News
Home / States / Andhra Pradesh / ఇలాంటి ఆర్థికసాయం ఎవరూ చేయలేదు…

ఇలాంటి ఆర్థికసాయం ఎవరూ చేయలేదు…

ఏలూరు: ఆటో కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని సీఎం జగన్‌ అన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వాహన మిత్ర పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం నాలుగు నెలల్లోనే హామీ నెరవేరుస్తున్నామని తెలిపారు. సొంత ఆటో ఉన్న డ్రైవర్ల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని ప్రకటించారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఐదేళ్లలో రూ.50 వేలు అకౌంట్‌లో వేస్తామని వెల్లడించారు. ఇలాంటి ఆర్ధికసాయం దేశ చరిత్రలో ఎవరూ ఎక్కడా చేయలేదని పేర్కొన్నారు. ప్రతీ పథకం అర్హులందరికీ అందేలా చూస్తామన్నారు. సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, పార్టీలు చూడమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద.. 1.75 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 1.73 లక్షల మందికి వర్తింపజేశామన్నారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. సొంత ఆటో, వైట్ రేషన్‌కార్డు ఉంటే ఈ పథకానికి అర్హులు అవుతారని వెల్లడించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *