Breaking News
Home / National / “నీళ్లు లేవు..ఇక ఇంటికెళ్లండి…” ఉద్యోగులకు చెప్పిన ఐటీ కంపెనీ

“నీళ్లు లేవు..ఇక ఇంటికెళ్లండి…” ఉద్యోగులకు చెప్పిన ఐటీ కంపెనీ

చెన్నై: “నీళ్లు లేవు..ఇక ఇంటికెళ్లండి. అక్కడి నుంచే పనిచేస్కోండి,” ఇది..చెన్నైలోని ఓ ఐటీ కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఉత్తర్వు. రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించినప్పటికీ… ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవటంతో కార్పోరేట్ కంపెనీలు కూడా నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ఆసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సివస్తోంది. ఐటీకి కంపెనీలకు కేరాఫ్ అడ్రస్ అయిన చెన్నయ్ ఓఎమ్మార్ రోడులోని సంస్థలు నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ఆనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే..ఇంటినుంచి పనిచేయాలంటూ ఉద్యోగులకు ఆదేశాలిస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు మాత్రం నిటి సంరక్షణ, పునర్వినియోగం కోసం అనేక చర్యలు చేపడుతున్నాయి. రుతుపవనాల రాకతో ఎండవెడి నుంచి కొంత ఉపశమనం లభించినప్పటికీ నీటి కష్టాలు మాత్రం ఇంకా తీరట్లేదు. అయితే..వార్షాలు మాత్రం సాధారణ స్థాయిలోనే ఉంటాయనే అంచనా..ప్రస్తుత పరిస్థితిల్లో కొంత ఊరట నిచ్చే అంశం.

Check Also

కశ్మీర్‌ వద్దు..కోహ్లిని ఇవ్వండి: పాక్ అభిమానులు

Share this on WhatsAppఇస్లామాబాద్‌ : ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో పాకిస్తాన్‌ చిత్తుగా ఓడటం తో ఆ దేశ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *