Breaking News
Home / National / నోబెల్ బహుమతి పొందిన అభిజిత్ బెనర్జీ

నోబెల్ బహుమతి పొందిన అభిజిత్ బెనర్జీ

న్యూఢిల్లీ: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారత సంతతి ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ భారతీయ సంప్రదాయంలో అదరగొట్టారు. పంచెకట్టులో నోబెల్ బహుమతి తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా అభిజిత్ ఘనత సాధించారు. అంతే కాకుండా ఆయన భార్య ఎస్తర్ దుఫ్లో కూడా చీరలో మెరిశారు. అభిజిత్‌లో పాటు ఆమె కూడా నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. వీరిద్దరితో పాటు మైకెల్ క్రెమెర్ ఈ బహుమతిని పంచుకున్నారు.
వీరికి ఈ రోజు నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ దుఫ్లో భారతీయ సంప్రదాయంలో కినిపించి అందరినీ ఆకర్శించారు. అభిజిత్ తెలుపు పంచె, నల్ల చొక్కాలో కనిపించగా, ఎస్తర్ ఆకుపచ్చ, నీలంరంగు కలపోతలో ఉన్న చీరతో ఆకట్టుకున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *