Breaking News
Home / National / ప్రధానిని కలిసిన నోబెల్ బహుమతి గ్రహీత…

ప్రధానిని కలిసిన నోబెల్ బహుమతి గ్రహీత…

ఢిల్లీ: ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న అభిజిత్ బెనర్జీ నేడు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. అభిజిత్‌ను కలవడం అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మానవ సాధికారత కోసం కచ్చితమైన లక్ష్యాలతో అభిజిత్ పనిచేస్తున్నారని, అనేక అంశాలపై విస్తృతమైన, ఆరోగ్యకరమైన చర్చ నిర్వహించామన్నారు. అభిజిత్ సాధించిన ఘనత పట్ల దేశం గర్వంగా ఫీలవుతుందంటూ భవిష్యత్తులోనూ ఆయన చేపట్టే ప్రాజెక్టులు సక్సెస్ కావాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం అభిజిత్ సూచించిన ప్రణాళికలను నోబెల్ కమిటీ గుర్తించింది. అయితే బీజేపీ ప్రభుత్వ విధానాన్ని అభిజిత్ తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ నేతలు నోబెల్ విజేతపైన కూడా విమర్శలు చేశారు. ఎటువంటి అవకాశం లేకపోవడం వల్ల ప్రజలు మోదీని ఎన్నుకున్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బెనర్జీ తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *