ఫిల్మ్ న్యూస్: తాజా ఓ ఫిలిం ఇన్స్టిట్యూట్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ తేజ మాట్లాడుతూ “చిరంజీవిగారు నటించిన ఓ సినిమాకు నేను కెమెరా విభాగంలో పనిచేశాను. ఆ సమయంలో చిరంజీవిగారిపై డైరెక్టర్ ఓ షాట్‌ను ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఆయన పరిగెత్తుకుంటూ వెళ్లాలి. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే ..చిరంజీవిగారు పరిగెత్తారు. డైరెక్టర్ షాట్ ఓకే అన్నారు. అయితే చిరంజీవిగారు వన్ మోర్ టేక్ అన్నారు. ఎందుకని ఆయన్ని అడిగితే ఆ సీన్లో పెట్టిన 20 రిఫ్లెక్టర్స్లో ఓ రిఫ్లెక్టర్ పనిచేయలేదు. అక్కడ లైటింగ్ తగ్గిందని ఆయన అన్నారు. నటనపై అంత అకింతం భావం ఉంది కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యారు. అలా ఓ నటుడికి తన నటన పట్ల ఆసక్తి, శ్రద్ధ ఉండాలి. ఊరకనే ఎవరూ మెగాస్టార్లు అయిపోరు” అన్నారు.
