Breaking News
Home / Featured / నోకియా లాంచ్ చేసిన ఫోన్ల ధరలు తగ్గాయ్…!

నోకియా లాంచ్ చేసిన ఫోన్ల ధరలు తగ్గాయ్…!

ముంబయి: హెచ్‌ఎండీ గ్లోబల్ తన నోకియా 3.2, 2.2 స్మార్ట్‌ఫోన్లను ఈ ఏడాది మే నెలలో లాంచ్ చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు గాను ఆ కంపెనీ భారత్‌లో ధరలను తగ్గించింది. నోకియా 3.2కు చెందిన 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వేరియెంట్ లాంచింగ్ ధర రూ.8,990 ఉండగా ఇప్పుడీ ఫోన్‌ను రూ.7,499 ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ లాంచింగ్ ధర రూ.10,790 ఉండగా, ఈ వేరియెంట్‌ను ప్రస్తుతం రూ.8499కు విక్రయిస్తున్నారు. అలాగే నోకియా 2.2కు చెందిన 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.6,999 ఉండగా దీన్నిప్పుడు రూ.6,599 ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే నోకియా 2.2 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.7,999 ఉండగా దీన్ని రూ.7,599కు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం తగ్గించిన ధరలకే ఈ రెండు ఫోన్లను విక్రయిస్తున్నారు.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *