Breaking News
Home / Crime / ప్రముఖ ట్రిపుల్‌ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలు

ప్రముఖ ట్రిపుల్‌ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలు

బాసర: అసాంఘిక కార్యకలాపాలకు బాసర ట్రిపుల్‌ ఐటీ అడ్డాగా మారింది. తాజాగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో ఒకరు నేపాల్‌ దేశానికి చెందిన వ్యక్తి కాగా, మరొకరు స్థానిక మహిళగా గుర్తించారు. వీరివురు ట్రిపుల్‌ ఐటీ ప్రైవేట్‌ క్యాంటీన్‌లో పనిచేసే వ్యక్తులుగా నిర్ధారించారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం క్యాంపస్‌ పరిధిలో ప్రైవేట్ క్యాంటీన్‌లు నడపకూడదన్న రూల్ ను అతిక్రమించి క్యాంటీన్‌ను నడుపుతున్నారు.

7వేల మంది విద్యార్థులు చదివే ప్రదేశంలో, అందులోనూ పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఉన్న చోట ఇలాంటి సంఘటనలు జరగడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో తీస్తున్న ప్రముఖ పత్రికా కెమెరామెన్‌ నుంచి కెమెరా లాక్కొని పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *