Breaking News
Home / social media / అగ్నిసాక్షిగా కాదు…అగ్నిపర్వతం సాక్షిగా…

అగ్నిసాక్షిగా కాదు…అగ్నిపర్వతం సాక్షిగా…

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్నిసాక్షిగా వివాహం చేసుకోవటం చాలా చోట్ల ప్రాచుర్యంలో ఉన్నదే… కానీ షినో వేఫ్లర్, కేట్‌ బాటిస్టా పామర్‌ అనే జంట మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించారు. తమ వివాహాన్ని ఫిలిప్పీన్స్‌లోని తాల్‌ అగ్నిపర్వతం దగ్గర ప్లాన్‌ చేసుకున్నారు. ఇలాంటి వివాహాలు గతంలో కూడా జరిగాయి, మరి వీరి వివాహంలో విశేషమేమిటి?అంటున్నారా… వెనుకగా అగ్నిపర్వతం విస్ఫోటం చెందుతూ ఉండగా ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు…అదీ సంగతి!

”పెళ్లికి కాస్త ముందుగా వివాహ ప్రదేశానికి చాలా దగ్గరగా ఉన్న తాల్‌ అగ్నిపర్వతం హఠాత్తుగా పొగ, బూడిద వెదచల్లటం మొదలెట్టింది. దానితో ఏదో జరుగుతోందని మాకు తెలిసింది. కానీ మేము వివాహాన్ని రద్దు చేసుకోలేదు. వాయిదా వేసుకోలేదు. ఈ నిర్ణయం వల్ల మేము అత్యద్భుతమైన క్షణాలను స్వంతం చేసుకోగలిగాం…” అని ఈ జంట ఆనందంతో తనమునకలవుతున్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫర్‌ రాండాల్ఫ్‌ ఇవాన్‌ తీసిన చిత్రాలు అందర్ని ఆకర్షించాయి.

Check Also

ఆ కుక్క బెస్ట్ ఫీల్డరట

Share this on WhatsAppక్రికెట్‌లో బెస్ట్ ఫీల్డర్ గురించి తరుచుగా వింటుంటాం. కానీ సోషల్ మీడియాలో ఓ కుక్కకు బెస్ట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *