Breaking News
Home / States / నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లే….

నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లే….

హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీరుపై బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ఆరోగ్యశాఖకు జబ్బు చేసిందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎల్బీనగర్‌లోని షైన్ ఆస్పత్రిలో నాలుగు నెలల శిశువు మృతి చెందటం బాధాకరం అన్నారు. ఆసుపత్రి యాజమాన్యం నియమ నిబంధనలు పాటించకపోవటం వల్లే అగ్నిప్రమాదం చోటుచేసుకుందన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ఆరోగ్యశాఖ అధికారులు లంచాలకు రుచి మరిగారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఏమాత్రం మానవత్వం లేదన్నారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని విమర్శలు గుప్పించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *