న్యూఢిల్లీ : ప్లాస్టిక్ బ్యాగ్ ఇవ్వకపోయే సరికి ఓ బేకరీలో పని చేస్తున్న వ్యక్తిని.. కస్టమర్ చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి దయాల్పూర్ ఏరియాలోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు. అక్టోబర్ 15వ తేదీన బేకరీలో ఆహార పదార్థాలు కొనేందుకు 24 ఏళ్ల యువకుడు వచ్చాడు. అయితే పదార్థాలను తీసుకెళ్లేందుకు కవర్ ఇవ్వాలని బేకరీ వర్కర్‌ను యువకుడు అడిగాడు. ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించిన క్రమంలో.. ప్లాస్టిక్ కవర్ ఇవ్వలేమని యువకుడుకు ఖలీల్ చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన ఫైజాన్ ఖాన్.. అహ్మద్ తలపై బ్రిక్‌తో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఖలీల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
