Breaking News
Home / States / Andhra Pradesh / హైకోర్టును తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాము….

హైకోర్టును తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాము….

ఏలూరు: హైకోర్టును తరలించవద్దని పశ్చిమగోదావరి జిల్లా న్యాయవాదులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్నచోటే హైకోర్టు కొనసాగించాలన్నారు. రాయలసీమకు తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. అమరావతి నుంచి హైకోర్టును కర్నూలుకు తరలిస్తారన్న ప్రచారంతో న్యాయవాది వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంగా న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ… కొంతమంది ప్రొద్భలం, కుట్రతో హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయన్నారు. దీంతో తాము గత 10 రోజుల నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చిత్తూరు నంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నామని, అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *