Breaking News
Home / States / Andhra Pradesh / వైద్యసిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్

వైద్యసిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖలో ఖాళీగా ఉన్న వైద్యసిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని వెల్లడించారు. శ్రీకాకుళం రిమ్స్ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖలో 9700 మంది సిబ్బంది నియామయానికి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు కార్పొరేట్ తరహాలో వైద్య సహాయం అందజేస్తామని ప్రకటించారు. రిమ్స్ దవాఖానలో ఎంఆర్ సీటీఐ స్కాన్ పనిచేయకపోవడంపై అధికారులపై ఆయన మండిపడ్డారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *