Breaking News
Home / States / తెలంగాణ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌…

తెలంగాణ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌…

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో నవంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో భాగంగా మద్యం దుకాణాల నిర్వహణకు బుధవారం రాష్ట్రంలో టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9 నుంచి 16 వరకు (ఆదివారం మినహా) కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 18 వ తేదీన ఉదయం 11 గంటల నుంచి కలెక్టర్‌ సమక్షంలో లాటరీ తీసి దుకాణాలను కేటాయిస్తారు. దరఖాస్తుదారులు నాన్‌ రిఫండబుల్‌ ఫీజు రూ.2 లక్షల డీడీ చెల్లించాలి. ఈ నెల 30 లోపు కొత్త మద్యం దుకాణాల యజమానులకు లైసెన్స్‌లు అందజేసి నవంబర్‌ ఒకటి నుంచి కొత్త యాజమాన్యాల ఆధ్వర్యంలో మద్యాన్ని విక్రయిస్తారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *