Breaking News
Home / National / ఎన్ఆర్‌సీని దేశమంతా అమలు చేస్తాము..

ఎన్ఆర్‌సీని దేశమంతా అమలు చేస్తాము..

కోల్‌కతా: దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ఎన్‌ఆర్‌సీ)ని కచ్చితంగా అమలుచేసి తీరుతామని కేంద్రహోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయమని స్పష్టం చేశారు. ఈ విషయంలో పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ ప్రభుత్వం అక్కడి ప్రజల్ని తప్పుతోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. నిజమైన భారతీయుల జాబితాతో తయారైందే పౌరసత్వ రిజిస్టర్‌. 1951 జనభా లెక్క సందర్భంగా రూపొందించిన ఈ రిజిస్టర్‌ను ఆ తర్వాత అప్‌డేట్‌ చేయలేదు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో భారతీయ పౌరసత్వ రిజిస్టార్‌ అప్‌డేట్‌తో కేంద్రం ఈ ప్రక్రియకు శ్రీకారంచుట్టింది.

ఈ రిజిస్టర్‌లో అక్కడి నివాసితుల్లో దాదాపు 19 లక్షల మందికి స్థానం దక్కలేదు. ఈ సందర్భంగా కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికలు ముందుండడంతో ముఖ్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమస్యను అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్తూ తమ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయాల్సిన అవసరం లేదని లేఖ కూడా రాశారు. ఈనేపథ్యంలో అమిత్‌షా మాట్లాడుతూ అక్రమ వలసదారులను ఓటు బ్యాంకుగా మార్చుకోవడం వల్లే తృణమూల్‌ ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ అమలును వ్యతిరేకిస్తోందని విమర్శించారు. హిందు, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందిన శరణార్థులు దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *