Breaking News
Home / National / కరోనా ఉందో.. లేదో.. 2 గంటల్లోనే …..!

కరోనా ఉందో.. లేదో.. 2 గంటల్లోనే …..!

కొత్త పరీక్షను అభివృద్ధి చేసిన ఎన్నారై శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ : ప్రస్తుతం కరోనా పరీక్షలు జరిగి.. ఆ వ్యాధి ఉందో, లేదో తేలడానికి రోజుల కొద్దీ సమయం పడుతోంది. ఈనేపథ్యంలో అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్త డాక్టర్‌ రవీంద్ర కొల్హే నేతృత్వంలోని పరిశోధక బృందం 2 గంటల్లోనే కరోనాను గుర్తించే సరికొత్త పరీక్షా పద్ధతిని అభివృద్ధి చేసింది. జార్జియా రాష్ట్రంలోని అగస్టా వర్సిటీలోని ల్యాబ్‌లో కొల్హే అండ్‌ టీం నిరంతరాయంగా 90 గంటలు జరిపిన పరిశోధనలు ఫలించాయి. అగస్టా వర్సిటీ పరిధిలో సేకరించిన రోగుల శాంపిళ్లను ఈ కొత్త టెస్టింగ్‌ పద్ధతిలో పరీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి రోజూ 72 శాంపిళ్ల ఫలితాలు ఇస్తున్నామని.. 500 శాంపిళ్లను పరీక్షించేలా టెస్టింగ్‌ పద్ధతిని అభివృద్ధి చేస్తామని కొల్హే చెప్పారు. ఈ బృందంలో భారత సంతతికి చెందిన ఆశిష్‌ మండల్‌, సుధా అనంత్‌, పంకజ్‌ అహ్లూవాలియా, నిఖిల్‌ సహజ్‌పాల్‌, మీనాక్షి అహ్లూవాలియా, యాస్మీన్‌ జిలానీ ఉన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *