విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఎన్ఎస్ఎస్, రెడ్‌క్రాస్ వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు. దుర్గమ్మ అంతరాలయం పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న.. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను పోలీసులు బయటకు పంపేశారు. దీంతో ఆగ్రహించిన వాలంటీర్లు నిరసనకు దిగారు. క్యూలైన్లు సక్రమంగా సాగడంలో వాలంటీర్ల పాత్రే కీలకమని పేర్కొన్నారు. దుర్గగుడి అధికారులు వివరణ ఇవ్వాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు.
