Breaking News
Home / Film News / ఢిల్లీ రాజకీయాలను శాసించబోతోన్న ఎన్టీఆర్..!

ఢిల్లీ రాజకీయాలను శాసించబోతోన్న ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ యన్టీఆర్. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసే నటుడు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, అన్న ఎన్టీఆర్ నుంచి పోలికలతో పాటు వాగ్దాటిని, ప్రతిభను పుణికిపుచ్చుకున్న మనవడు. 2009 ఎన్నికల్లో తన తాత పెట్టిన పెట్టిన తెలుగుదేశం నుంచి ప్రచారం చేసిన తారక్..ఆ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌కే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆయన జక్కన్న డైరెక్షన్‌లో రామ్ చరణ్‌తో కలిసి ఆర్​ఆర్​ఆర్​’ అనే మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో మరో మూవీ ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనేది ఈ సినిమా టైటిల్‌ అని సోషల్ మీడియాలో విసృతంగా సర్కులేట్ చేస్తోన్నారు ఫ్యాన్స్.

అయితే ఫిల్మ్ నగర్ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ఈ మూవీ కథను ఢిల్లీ రాజకీయాల నేపథ్యంలో రాసుకున్నాడట మాటల మాంత్రికుడు. ఓ పవర్‌ఫుల్ పొలిటిషన్ రోల్లో తారక్ నటించనున్నాడని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ తన సెంటిమెంట్ కలిసొచ్చే విధంగా ‘అ’ అనే అక్షరం టైటిల్ ఫిక్స్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *