Breaking News
Home / Lifestyle / Health & Fitness / గుజరాత్ రాష్ట్రంలో పెరిగిన స్థూలకాయుల సంఖ్య

గుజరాత్ రాష్ట్రంలో పెరిగిన స్థూలకాయుల సంఖ్య

అహ్మదాబాద్ : మీరు వేసుకున్న ప్యాంటు బిగుతుగా అనిపిస్తుందా? మీరు విమానం మెట్లు ఎక్కేటపుడు హిమాలయాలపై ట్రెక్కింగ్ చేసినట్లు అనిపించిందా? మీ మోకాళ్లు, వెన్నెముక నొప్పి అనిపిస్తుందా? అవునని మీ నుంచి సమాధానం వస్తే మీరు స్థూలకాయం బారిన పడుతున్నారన్నట్లే అని చెపుతున్నారు వైద్య నిపుణులు. 1990 నుంచి 2016వ సంవత్సరం వరకు లాస్సెట్ సంస్థ ఒబేసిటీపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. గుజరాత్ రాష్ట్రంలోని పురుషుల్లో 149 శాతం, మహిళల్లో 121.6 శాతం స్థూలకాయులు పెరిగారని తేలింది. ఒబేసిటీ సమస్యతో సతమతమవుతున్నారని తేలింది. పిల్లలు అధికంగా జంక్ ఫుడ్ తినడం, కొరవడిన శారీరక శ్రమ, గంటల తరబడిగా టీవీలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోయి ఉండటం వల్ల స్థూలకాయం పెరుగుతోందని లాన్సెట్ అధ్యయనంలో వెల్లడైంది. గోవాలో పురుషుల్లో 124 శాతం, మహిళల్లో 135 శాతం మంది ఒబేసిటీ బారిన పడ్డారని అధ్యయనం వెల్లడించింది.

Check Also

మరో గాంధీ వచ్చినా ఏమీ చేయలేరు: అమిత్‌షా

Share this on WhatsAppసమష్టిపూర్: రాహుల్ మాత్రే కాదు, ఆయన తర్వాత మరో గాంధీ వచ్చినా సాయుధ బలగాల ప్రత్యేక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *