Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / అక్టోబరు 1 నవ్యాంధ్ర పుట్టిన రోజు

అక్టోబరు 1 నవ్యాంధ్ర పుట్టిన రోజు

ఆ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలి: తులసిరెడ్డి
విజయవాడ: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబరు ఒకటో తేదీనే నిర్వహించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్‌.తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు 1952 అక్టోబరు 19న మద్రాసులో అమరణదీక్ష చేపట్టారన్నారు. ఆయన ఆత్మబలిదానం కారణంగానే 1953 అక్టోబరు ఒకటిన రాయలసీమ, కోస్తాంధ్రతో కూడిన ఆంధ్రరాష్ట్ర ఏర్పడిందన్నారు. తర్వాత 1956 నవంబరు ఒకటిన హైదరాబాబాద్‌ రాష్ట్రంలోని తెలంగాణతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందన్నారు. మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ 2014 జూన్‌ రెండున విడిపోయి నవ్యాంధ్ర మిగిలిందన్నారు. దీని ప్రకారం అక్టోబరు ఒకటి నవ్యాంధ్రకు పుట్టిన రోజైతే, నవంబరు ఒకటి పెళ్లి రోజని చెప్పారు. జూన్‌ రెండో తేదీ విడాకుల రోజని పేర్కొన్నారు. పుట్టిన రోజునే అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని తులసిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *