Breaking News
Home / National / ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం….?

ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం….?

భువనేశ్వర్ (ఒడిశా) : దిశ, ఉన్నావ్ హత్యాచార ఘటనల నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఒడిశా రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారం కేసుల సత్వర పరిష్కారానికి 45 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఒడిశా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా వెల్లడించారు.రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారం కేసుల సత్వర పరిష్కారానికి 21 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, బాలికలపై జరిగిన అత్యాచారం కేసుల దర్యాప్తునకు 24 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రతాప్ జెనా వివరించారు. అత్యాచారం కేసుల్లో దోషులకు సత్వరం శిక్షలు పడేలా చేసేందుకు ఒడిశా సర్కారు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుందని న్యాయశాఖ మంత్రి పేర్కొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *