Breaking News
Home / States / నేరానికి, హోదాకు సంబంధం లేదు…

నేరానికి, హోదాకు సంబంధం లేదు…

హైదరాబాద్: సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టుకు తప్పకుండా హాజరు కావాలని హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏ1, ఏ2 నిందితులు ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందేనని జగన్ తరపు న్యాయవాదికి సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు జరిగిన అనంతరం.. ఏ1, ఏ2 నిందితులుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈనెల 10న విచారణకు హాజరై తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. నేరానికి, హోదాకు సంబంధం లేదని న్యాయస్థానం పేర్కొంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *